ట్రంప్‌ ఎఫెక్ట్‌: అమెరికాలో 15 వేల ఉద్యోగాలు

17 Feb, 2017 19:53 IST|Sakshi
ట్రంప్‌ ఎఫెక్ట్‌: అమెరికాలో 15 వేల ఉద్యోగాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక  విధానాలకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ప్రభావితం కానుంది.  అమెరికాలో 15,000 ఉద్యోగాలను కల్పించనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది.  అలాగే అమెరికాలో ఉద్యోగుల శిక్షణకోసం 10 ఇన్నోవేషన్‌  కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీనికోసం 1.4 బిలియన్‌ డాలర్లను వెచ్చించనున్నట్టు ప్రకటించింది.  దీంతో 2020 నాటికి 65 వేలమందికిపైగా ఉద్యోగులతో అమెరికాలో తమ కంపెనీల ఉద్యోగుల శాతం 30శాతానికి పెరగనుందని పేర్కొంది. డబ్లిన్‌, ఐర్లాండ్‌ రాష్ట్రాల్లో టెక్‌ సేవలను అందిస్తున్న  యాక్సెంచర్‌ భారతదేశంలోనే ఎక్కువ సిబ్బంది కలిగివుంది. దేశీయంగా 3 లక్షల ఎనభైవేలకు పైగా ఉద్యోగులు  ఈ సంస్థలో పనిచేస్తున్నారు.

కాగా హెచ్‌1బీ వీసాల  ఆంక్షలు,  అమెరికాలోని ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్న ట్రంప్‌ నిబంధనలతో  ప్రముఖ ఐటీ, ఇతర సంస్థలు, భారత ఐటీ పరిశ్రమ ఆందోళన పడిపోయిన సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు