డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం

18 Oct, 2016 18:17 IST|Sakshi
డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం

ముంబై: భారత్-పాక్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ప్రశ్నించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి విమర్శలపాలయ్యారు. ఇంటర్వూ చేసేందుకు కశ్యప్ ఇంటికి వెళ్లిన మహిళా జర్నలిస్టు వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అంతేకాకుండా తాను ఇంటర్వూ ఇవ్వనని చెబుతున్నా వినకుండా హెడ్ లైన్ వార్తల కోసం జర్నలిస్టులు కక్కుర్తి పడుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా తనను కలవాలనే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు. జర్నలిస్టుతో వాట్సాప్ సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి..
జర్నలిస్టు: అనురాగ్ మీరు మాట్లాడాలి
డైరెక్టర్: కుదరదు
జర్నలిస్టు: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న మీరు ఎందుకు మాట్లాడలేరు?
డైరెక్టర్: బాధ్యత లేకుండా కేవలం శీర్షికల కోసమే పనిచేసే మీడియాతో నేను మాట్లాడను.
జర్నలిస్టు: ఈ మాటలు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కంటే కెమెరా ముందు చెప్పండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను మీ ఇంటి వద్దే ఉన్నాను. మీరు అందుబాటులో ఉన్నారా?
డైరెక్టర్: లేదు.

సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టిన కొంతసమయంలోనే నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ పోస్టులను తన అకౌంట్ నుంచి తొలగించి తన ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆయనపై నెటిజన్ల ఆగ్రహం తగ్గలేదు. టెర్రిరిజంపై దేశం అట్టుడుకుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొంతమంది కశ్యప్ కు హితవు పలికారు.

మరిన్ని వార్తలు