వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్

7 Sep, 2015 09:59 IST|Sakshi
వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్

న్యూయార్క్: 40 ఏళ్ల నాటి ఆపిల్ తొలితరం కంప్యూటర్ ఒకటి వేలానికి రానుంది. 1977లో ఆపిల్ సంస్థ మాజీ సీఈఓ స్టీవ్‌ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్‌తో కలిసిదీన్ని స్వయంగా చేతితో తయారుచేసింది కావడం విశేషం. ఇది దాదాపు 3,30,000 పౌండ్ల ధర (దాదాపు రూ.3.3 కోట్లపైమాటే) పలకనుందని అంచనా వేస్తున్నారు.

ఆపిల్-1 మదర్ బోర్డు వినియోగించిన ఈ తొలితరం కంప్యూటర్‌ను వాస్తవానికి బైట్‌షాప్ 437 పౌండ్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది చక్కగానే పనిచేస్తుండటం విశేషం. దీన్ని ఈనెల 21న బన్‌హామ్స్‌లో వేలం వేయనున్నారు. ప్రారంభ ధర 3,30,000 పౌండ్లుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు