Sakshi News home page

రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే

Published Tue, Sep 26 2023 12:06 PM

Elon Musk Reaction To Sale Of His Biography - Sakshi

అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ కాపీలు హాట్‌ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్‌ మస్క్‌’ పేరుతో విడుదలైన మస్క్‌ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి.  

ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్‌ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్‌ కో- ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. 

వారంలోనే అన్ని పుస్తకాల
ప్రొఫెసర్‌, ఆథర్‌, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్‌ కోఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్‌ 5,  2011లో స్టీవ్‌ జాబ్స్‌ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. 

మస్క్‌ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం  
వాల్టర్ మస్క్‌ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్‌ అటెండ్‌ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్‌ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్‌ రాశారు. 

ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ బుక్‌ ఎప్పుడు విడుదలైంది?


ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీని వాల్టర్‌ ఐజాక్సన్‌ రాశారు. సెప్టెంబర్‌ 12,2023న విడుదల చేశారు. 

మస్క్‌ బయోగ్రఫీ బుక్‌లో ఏముంటుంది?
ఎలాన్‌ మస్క్‌! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్‌ బేరర్‌ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్‌ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్‌ గర్ల్‌ ఫ్రెండ్‌లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్‌ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపుకుడు బిల్‌గేట్స్‌తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. 

వాల్టర్‌ ఇప్పటికే 
వాల్టర్‌ ఇప్పటికే రాసిన ఐన్‌స్టీన్‌, బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. 

బయోగ్రఫీపై ఎలాన్‌ మస్క్‌ స్పందన 


తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్‌ స్పందించారు. ‘క్లోజప్‌లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు.

Advertisement

What’s your opinion

Advertisement