రేటింగ్‌ ఏజెన్సీలపై అరవింద్ ఆగ్రహం

11 May, 2017 17:15 IST|Sakshi
రేటింగ్‌ ఏజెన్సీలపై అరవింద్ ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలపై  ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్‌ ఏజెన్సీల పేరుతో ఆడుకుంటున్నాయనీ మండిపడ్డారు.  వాటివి  పూర్‌ స్టాండర్డ్స్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా  గత కొన్ని సంవత్సరాలలో  భారత్‌లో బలమైన ఆర్థిక పనితీరు ఉన్నప్పటికీ భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చడం లేదని  ఆయన  విమర్శించారు.  వికెఆర్వి మెమోరియల్ లెక్చర్‌  సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సంవత్సరాల్లో ఆర్ధిక ఫండమెంటల్స్ (ద్రవ్యోల్బణం, పెరుగుదల, ప్రస్తుత ఖాతా పనితీరు)లో స్పష్టమైన మెరుగుదలలు ఉన్నప్పటికీ, రేటింగ్ ఏజెన్సీలు భారత్‌కు బీబీబీ రేటింగ్‌ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు  చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పటికీ, దానికి  రేటింగ్‌ను  ఏఏగా  అప్‌ గ్రేడ్‌ చేస్తున్నారని  ఆరోపించారు.  

మరో మాటలో చెప్పాలంటే రేటింగ్ ఏజెన్సీలు చైనా, భారత్‌  రేటింగ్‌ విషయంలో విరుద్ధంగా  వ్యవహరిస్తున్నాయన్నారు.  ఇలాంటి రేటింగ్‌లను విశ్లేషకులందరినీ మనం సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలని  సుబ్రహ్మణ్యన్‌ ప్రశ్నించారు. దేశీయంగా నిపుణుల విశ్లేషణలకు, అధికారిక​ నిర్ణయాలకు  సారూప్యం ఉంటోందన్నారు. విధాన నిర్ణయాల ముందు, నిపుణ విశ్లేషణ తరచుగా భిన్నంగా ఉన్నా,  నిర్ణయాలు తీసుకున్నతర్వాత విశ్లేషణ ధ్వని మరియు స్వరం  మారుతోందన్నారు. అధికారిక నిర్ణయాన్ని హేతుబద్ధంగా విశ్లేషిస్తున్నారని సుబ్రహ్మణ్యన్ చెప్పారు.

అనేక ఆర్థిక సంక్షోభ సమయాల్లో ముందస్తు  హెచ్చరికలు  జారీచేయడంలో రేటింగ్‌ ఏజెన్సీలు వరుసగా విఫలమవుతూ వచ్చాయంటూ  దాడి చేశారు. ముఖ్యంగా  అమెరికా ఆర్థిక వ్యవస్థను  సంక్షోభంలోకి నెట్టిన  తనఖా-రుణాల సెక్యూరిటీలకు ఏఏఏ రేటింగ్‌ ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందన్నారు. అధికారంలోకివచ్చిన 2014నుంచి విధానాలను క్రమబద్దీకరించడానికి , ద్రవ్యోల్బణ అదుపునకు  చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు