గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం

23 Apr, 2014 15:46 IST|Sakshi
గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం

ఎంహెచ్ 370 మలేసియా విమానం గల్లంతై 50 రోజుల దాటి పోయింది... అయినా ఇంతవరకు ఆ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆ విమాన ఆచూకీ కోసం గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఆచూకీ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ జానస్టన్ బుధవారం వెల్లడించారు. ఆ అంశంపై ఇప్పటికే మలేసియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

రెండు ప్రపంచ యుద్ద సమయంలో టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో నౌకలోని 1500 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆ నౌక ఆచూకీ కోసం అన్వేషణలు తీవ్రంగా సాగిన చిట్ట చివరకు 1985 అట్లాంటిక్ సముద్రంలో  3,800 మీటర్ల అడుగున టైటానిక్ను కనుగొన్న విషయం విదితమే.   

227 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో గతనెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంలో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు విమానాలు, నౌకలు, శాటిలైట్ల ద్వారా సముద్రంలో జల్లెడ పట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన విజ్ఞానం ద్వారా అయిన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ తెలుస్తుందని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఆ విమాన ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు