రియల్‌ బాహుబలిని చూశారా?

17 May, 2017 16:42 IST|Sakshi
రియల్‌ బాహుబలిని చూశారా?

కాన్‌బెరా: కండలుతిరిగిన కంత్రీ కాలకేయుల్ని పిండిచేసిన సినీ బాహుబలికి ప్రపంచ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.. 30 టన్నుల భారీ పొక్లెయిన్‌ను అమాంతం పైకిలేపి ఫీట్లు చేసిన ఓ కార్మికుడిని ‘రియల్‌ బాహుబలి’ అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు!

అతని పేరు ఏదైనా కావచ్చు, సోషల్‌ మీడియా చేత బాహుబలి అనిపించుకున్నాక పేరు ఏదైతేనేం? ఇక ఊరి విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలోని ఓ చిన్నపట్టణం. పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న ఇతను.. లంచ్‌ బ్రేక్‌లో సరదాగా చేసిన ఈ ఫీట్‌ తాలూకు వీడియో వైరల్‌ అయింది.

సహచరుల కేరింతల మధ్య.. ఉత్తచేతులతో 30 టన్నుల పొక్లెయిన్‌ను అమాతం పైకెత్తి, మళ్లీ కిందికి దింపుతూ మనోడు బెంచ్‌ప్రెస్‌ కొట్టాడు. ‘ఆసీ కామెడీ’ ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్‌ అయిన ఈ విడియోను గంటల వ్యవధిలోనే లక్షలమంది వీక్షించారు. వారిలో కొందరు ఏసియన్లు సదరు సాహసిని బాహుబలితో పోల్చడం విశేషం.

మరిన్ని వార్తలు