సాగర తీరంలో ఒబామా షికారు

5 Feb, 2017 14:08 IST|Sakshi
సాగర తీరంలో ఒబామా షికారు

అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు ముగిసిన వెంటనే బరాక్ ఒబామా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య మిషెల్ తో కలిసి సముద్ర తీరంలో సెలవులు గడుపుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, మరికొంత మందిలో కలిసి ఒబామా దంపతులు సరదాగా గడుపుతున్న దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నలుపు రంగు టీ-షర్ట్, షార్ట్ ధరించి భార్యతో కలిసి బీచ్ లో ఒబామా నడుస్తున్న ఫొటోలు, దృశ్యాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఒబామా ఆహార్యం చూసి ఆశ్చర్యపోతున్నారు.

సాధారణ దుస్తుల్లో ఒబామా చాలా బాగున్నారని, ఆయన స్టైల్ అదిరిందని కామెంట్లు పెట్టారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని కొంత మంది పేర్కొన్నారు. ట్విటర్ లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1న షేర్ చేసిన ఈ వీడియోకు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 78 వేల మందిపైగా రీట్వీట్ చేశారు. కాగా, ఒబామా మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు