బంగ్లాదేశ్లో పెరిగిన గోమాంసం ధరలు!

9 Oct, 2015 19:45 IST|Sakshi

పొరుగు దేశాల్లో కబేళాలకు తరలించేందుకు మన దేశం నుంచి జరిగే ఆవుల స్మగ్లింగును తాము గణనీయంగా తగ్గించామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి వల్లే భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు నిఘాను పెంచాయని, దానివల్ల ఆవుల స్మగ్లింగ్ బాగా తగ్గిందని చెప్పారు.

ఇంతకుముందు ఏడాదికి 13 లక్షల ఆవులు బంగ్లాదేశ్కు స్మగుల్ అయ్యేవని, ఇప్పుడా సంఖ్య 2-3 లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ కారణంగా బంగ్లాదేశ్లో గోమాంసం ధరలు బాగా పెరిగాయని చెప్పారు. ఈ విషయాన్ని తనకు భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ స్వయంగా చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు