రాష్ట్రంలోనే కాదు బయటా మందు బంద్‌

16 Feb, 2017 12:11 IST|Sakshi

పట్నా: బిహార్‌లో మద్యాన్ని నిషేధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీన్ని అమలు చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా నితీష్‌ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది.  బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రం బయటకు కూడా మద్యం తాగకుండా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.

1976 బిహార్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి, 2017 బిహార్ జ్యుడిసియల్ అధికారుల ప్రవర్తన నియమావళిలో సవరణ చేయాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. బుధవారం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతమున్న ప్రవర్తన నియమావళి ప్రకారం పనిచేసే ప్రదేశంలో మాత్రమే మద్యాన్ని సేవించరాదనే నిబంధన ఉంది. సవరణ చేసే నియమావళి ప్రకారం ఉద్యోగులు పనిచేసే చోట లేదా ఇంట్లోనే గాక బిహార్ బయట టూర్కు వెళ్లినపుడు కూడా మద్యాన్ని సేవించరాదు.
 

మరిన్ని వార్తలు