దిగ్విజయపై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత

12 Dec, 2013 19:19 IST|Sakshi
దిగ్విజయపై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత

ఇండోర్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్పై మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్వర్గియ ప్రశంసలు కురిపించారు. దిగ్గీ రాజాను ప్రతిభావంతుడైన సంస్థాగత నాయకుడిగా ఆయన వర్ణించారు. ఒకవేళ దిగ్విజయ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఇంతకుముంతు శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన కైలాష్ అన్నారు.

దిగ్విజయ్ సింగ్ సేవలను సరిగా వినియోగించుకోకపోవడం వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలను సరిగా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కారణంగానే కాంగ్రెస్కు నష్టం కలిగిందని కైలాష్ పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు