పప్పు ధాన్యాల ధరలకు కళ్లెం..!

12 Sep, 2016 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: నింగిని తాకుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.  పప్పుధాన్యాల నిల్వలను భారీ ఎత్తున  పెంచాలని ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. ప్రస్తుతం  8 లక్షలుగా ఉన్న  బఫర్ స్టాక్  ను 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దేశీయ సేకరణ ద్వారా  10 లక్షల టన్నులు,  దిగుమతి ద్వారా 10 లక్షల టన్నులను సేకరించనున్నట్టుతెలిపింది. పప్పుధాన్యాల నిల్వలు పెంచితే అది భవిష్యత్తులో ధరలకు కళ్లెం వేయడానికి ఉపయోగపడుతుందని సీసీఈఏ  అంచనా వేస్తోంది.

కాగా ఈ ఏడాది  జూన్ లో సబ్సిడీపై  కిలో రూ.120కు విక్రయించేందుకు వీలుగా   పప్పుధాన్యాల నిల్వలను 8లక్షల టన్నులకు పెంచిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు