సముద్ర తాపంతో ఆహార ఉత్పత్తికి దెబ్బ | Sakshi
Sakshi News home page

సముద్ర తాపంతో ఆహార ఉత్పత్తికి దెబ్బ

Published Mon, Sep 12 2016 1:27 PM

Ocean Warming To impact food production in India: Study

కొచ్చి: సముద్రాల్లో పెరుగుతున్న వేడి భవిష్యత్తులో భారత్‌తోపాటు ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు పెనుముప్పుగా మారనుందని తేలింది. సముద్రాల్లో జరుగుతున్న ఈ వాతావరణ మార్పులు నేరుగా ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయన నివేదికలో పేర్కొంది. సముద్ర తాపం వల్ల వాతావరణంలో కలుగుతున్న మార్పులు రానున్న రోజుల్లో సవాలుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ(ఐయూసీఎన్) పేర్కొంది.

నివేదికను ఇటీవలే హువాయ్‌లో ముగిసిన ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్‌లో ఐయూసీఎన్ విడుదల చేసింది. 1970వ దశకం నుంచి సముద్రాల్లో పెరుగుతున్న వేడి మానవ కార్యకలాపాల ఫలితమేనని నివేదిక పేర్కొంది. సముద్ర తాపానికి  కారణాలు, ప్రకృతిపై దాని ప్రభావం, తదనంతర పరిణామాలపై  సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి.

ఇప్పటికే దీని తాలూకు ప్రభావం చాలా ప్రాంతాలపై మొదలైందని, భూమధ్యదర ప్రాంతంలో వర్షాలు పెరగ్గా, ఉపఉష్ణ మండల ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ రెండు స్థితుల వల్ల ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, భారత్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపి పంట దిగుబడి క్షీణతకు అవకాశం ఉందని పేర్కొంది. మత్స్య సంపదకూ నష్టం వాటిల్లుతుందని చెప్పింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement