నిత్యం నన్నే తలుచుకోండి

7 Jan, 2017 04:35 IST|Sakshi
నిత్యం నన్నే తలుచుకోండి

జన్మభూమి సభలో చంద్రబాబు వేడుకోలు
చేస్తున్న మేలుకు కృతజ్ఞులై ఉండండి  
సభికులతో ప్రతిజ్ఞ చేయించిన సీఎం


సాక్షి ప్రతినిధులు, శ్రీకాకుళం/ విజయనగరం: ‘చంద్రన్న బీమా అమలు చేస్తున్నా. తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌లు పెట్టించా. పండుగలకు కానుకలు ఇస్తున్నా. ఇంకా ఎన్నో చేస్తున్న నన్ను గుర్తు పెట్టుకోవాలా... వద్దా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న వారంతా నన్నే తలుచుకోవాలి. చేస్తున్న మేలుకు కృతజ్ఞతలు చెప్పండి.  నిత్యం గుర్తుంచుకోవాలి. ఆశీర్వదించాలి..’ అంటూ సీఎం చంద్రబాబు ప్రజలను ప్రాధేయపడ్డారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించు కున్నారు. బాబు వైఖరి సభికులకు నవ్వు తెప్పించింది. మరోవైపు శిక్షణ ఇచ్చిన వ్యక్తుల చేత మాట్లాడించడం, ఆద్యంతం పొగిడించుకోవడంతో జన్మభూమి సభలు టీడీపీ సభలను తలపించాయి.

జన్మ భూమి–మా ఊరు లో భాగంగా శుక్రవారం బాబు  శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా ద్వారపూడిలో నిర్వహిం చిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాంలో సీఎం అంతా తానై రెండు గంటల పాటు సభ నడిపించారు.  ‘జీవితంలో ఎదగ డానికి ఎంతో మేలు చేసిన ప్రకృతి, తల్లి దండ్రులు, గురువులు, జన్మభూమి, ప్రభు త్వం... ఈ ఐదింటిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆ మాదిరిగానే ఎన్నో చేస్తున్న నాకు కూడా నిత్యం కృతజ్ఞులై ఉండాలి..’ అని పదేపదే అన్నారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను జన్మభూమి ప్రతిజ్ఞలోనూ చేర్పించి అందరితోనూ పలికించారు.

ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు: సీఎం
సాక్షి, అమరావతి: నీటి కొరత ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవు తున్నాయని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ హెచ్‌కే హల్దార్‌ను విజయవాడలో కలసి సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు