కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం

3 May, 2017 17:06 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం
  • రాష్ట్రపతి బరిలోకి పోటీకి సై
  • ప్రాంతీయ పార్టీలతో మంతనాలు
  • న్యూఢిల్లీ: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో జరగనున్న రాష్టపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని కేంద్రంలోని అధికార బీజేపీ కృతనిశ్చయంతో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ సర్కారుకు గట్టిపోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

    ఇందులోభాగంగా పలు పార్టీలతో కాంగ్రెస్‌ పెద్దలు మంతనాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతునివ్వాలంటూ ఇప్పటికే సోనియాగాంధీ మమతా బెనర్జీ, లాలూప్రసాద్‌ యాదవ్‌ తదితరులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలోనే ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో ఈ విషయమై చర్చించనున్నారు.

     

మరిన్ని వార్తలు