ప్రైవేటు విమానాన్ని కొన్న హీరో!

21 Apr, 2017 10:36 IST|Sakshi
ప్రైవేటు విమానాన్ని కొన్న హీరో!

‘ఉడ్తా పంజాబ్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన దిల్‌జిత్‌ దోసాన్జ్‌ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ఫిలింఫేర్‌ అవార్డును సైతం అతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ‘ఫిల్హౌరి’ సినిమాలోనూ దిల్‌జిత్‌ అలరించాడు. ఇక అసలు విషయానొకొస్తే దిల్‌జిత్‌ తాజాగా ఓ ప్రైవేటు జెట్‌ విమానాన్ని కొనుగోలు చేశాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘ ప్రైవేటు జెట్‌తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ అతను ట్వీట్‌ చేశాడు. దిల్‌జిత్‌ త్వరలోనే తన టీమ్‌తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్‌) నిర్వహించబోతున్నాడు. త్వరలో వాంకోవర్‌, ఎడ్మంటన్‌, విన్నిపెగ్‌, టోరంటోలో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అతను పెట్టిన కొత్త విమానం ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు