రష్యాకు ట్రంప్‌ స్నేహహస్తం

16 Jan, 2017 14:56 IST|Sakshi
రష్యాకు ట్రంప్‌ స్నేహహస్తం

వాషింగ్టన్‌: రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు ‘ఒక చైనా’ పాలసీపై చర్చలు చేయనున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ అన్యాపదేశంగా చెప్పారు. ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ట్రంప్‌ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడవుతోంది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేలా సైబర్‌ దాడులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో రష్యాపై అమెరికా అధ్యక్షుడు ఒబామా గత నెలలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

వీటిని కొంతకాలం వరకు అలాగే ఉంచుతానని ట్రంప్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ రష్యా హింసాత్మక ఉగ్రవాదంపై పోరు వంటి తమ కీలక లక్ష్యాల సాధనకు తోడ్పడితే ఆంక్షల వంటి వాటిని ఎత్తేయవచ్చు అని ట్రంప్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న తాను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమవుతానని కూడా చెప్పారు.  
 

మరిన్ని వార్తలు