సహృదయులైన ట్రంప్.. జీతం చారిటీకి

14 Mar, 2017 10:58 IST|Sakshi
సహృదయులైన ట్రంప్.. జీతం చారిటీకి
వాషింగ్టన్ : కఠినమైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహృదయులయ్యారు. తన వార్షిక వేతనాన్నంతటిన్నీ చారిటీకి డొనేట్ చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వార్షిక అధ్యక్ష జీతం 400,000 డాలర్ల(రూ.2,64,82,000)ను ఈ  ఏడాది చివర్లో చారిటీకి విరాళంగా  ఇవ్వబోతున్నట్టు అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. సోమవారం ఈ విషయాన్ని స్పైసర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో తన వేతనాన్నంతటిన్నీ చారిటీకి ఇవ్వాలనేది అధ్యక్షుడి ఉద్దేశ్యమని స్పైసర్ తెలిపారు. అమెరికన్ ప్రజలకు కూడా ఆయన వాగ్దానం చేసినట్టు తెలిపారు.
 
ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటనలలో ఇదే అనూహ్య ప్రకటనని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ట్రంప్ తాను వేతనం తీసుకోబోనని పలుమార్లు తెలిపారు. కేవలం ఒక్క డాలర్ ను మాత్రమే వేతనంగా తీసుకోబోతున్నట్టు తెలిపారు.  అంతకముందు కూడా హెర్బర్ట్ హూవేర్, జాన్ ఎఫ్ కెన్నడీలు కూడా తమ ప్రెసిడెన్షియల్ శాలరీలను చారిటీకి డొనేట్ చేశారు.  
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు