ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచండి

12 Feb, 2014 02:00 IST|Sakshi

సోనియాకు ఖమ్మం కాంగ్రెస్ నేతల వినతి
 సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే భద్రాచలం, పాల్వంచలోని గ్రామాలను సీమా్రంధలో కలపాలనే ప్రతిపాదన సరికాదని, ఆయా గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మంగళవారం వివరించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు సోనియాను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం వల్ల గిరిజన సంస్కృతి దెబ్బతింటుందని, వారు సీమాంధ్రలో ఏర్పడే కొత్త రాజధానిని చేరుకునేందుకు  500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీరి విజ్ఞప్తికి స్పందించిన సోనియా.. జీవోఎం సహా ఇతర నేతలను కలిసి సమస్యను వివరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు