'అందులో విదేశీ హస్తం ఉంది.. బయటపెడతాం'

21 Oct, 2015 17:56 IST|Sakshi
'అందులో విదేశీ హస్తం ఉంది.. బయటపెడతాం'

న్యూఢిల్లీ: పంజాబ్లో గత కొన్ని రోజులుగా సిక్కు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆందోళనలు నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని కేంద్రమంత్రి అకాలీ దళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. త్వరలోనే వారి వివరాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ ఫరీద్ కోట్లో ఓ సిక్కు వర్గం నిరసన ర్యాలీకి బయలుదేరగా.. వారిని మరో వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లతోపాటు, పదునైన ఆయుధాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కూడా జోక్యం చేసుకోగా వారిని తీవ్రంగా గాయపరిచారు.

దీని అనంతరం పంజాబ్లో పలు సున్నిత ప్రాంతాల్లో ఈ ఘర్షణలు వాయువేగంతో వ్యాపించి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం కూడా అక్కడ ఇంకా అలాంటి పరిస్దితులే ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందించిన తర్వాత కేంద్ర నుంచి తొలిసారి ఓ కేంద్రమంత్రి స్పందించి సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఘర్షణల వెనుక విదేశీ హస్తం ఉందన్నారు. అన్ని వర్గాలు దయచేసి శాంతి సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు