మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య

27 Feb, 2014 15:20 IST|Sakshi
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య

వెనిజువెలాకు చెందిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఆంటోనియో సెర్మెనోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అనంతరం హతమార్చారు. సెర్మెనో గతంలో ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి సూపర్ బాంటమ్ వెయిట్, ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా ఉండేవారు. 1980లు, 90లలో ఈ రెండు విభాగాల్లో ఆయనదే రాజ్యం. 44 ఏళ్ల సెర్మెనోను ఆయన కుటుంబ సభ్యులతో సహా అందరినీ సోమవారం నాడు అపహరించారు. మంగళవారం నాడు తూర్పు కారకాస్ ప్రాంతంలో ఆయన మృతదేహం జాతీయ రహదారి మీద పడి కనిపించింది. ఆయన మరణానికి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సంతాపం తెలిపారు.

వెనిజువెలాలో ఇటీవలి కాలంలో హింసాత్మక సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు గాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాల్లో సెర్మెనో శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా యువకులను వీధిపోరాటాలకు దూరం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే, సెర్మెనో హత్యకు కారణాలేంటన్న విషయాన్ని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు