28వేల మందికి ఉపాధి

17 Sep, 2016 15:46 IST|Sakshi
28వేల మందికి ఉపాధి

న్యూఢిల్లీ:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ జియోనీ హరియాణాలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.  ఈమేరకు హరియాణా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతగా రూ.500 కోట్ల పెట్టుబడితో దాదాపు 50 ఎకరాల్లో  తయారీ యూనిట్‌ను ఫరీదాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.  దీని ద్వారా రానున్న మూడేళ్లలో దాదాపు 28వేల మంది ఉపాధి కల్పించనున్నట్టు  జియోనీ  ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశం తమకు  అత్యంత ముఖ్యమైన మార్కెట్ గా భావిస్తున్నామని ఇక్కడ  విశేషమైన వృద్ధి ఉందని జియోనీ మొబైల్ చైర్మన్ లియు లిరాంగ్  చెప్పారు. 30 మిలియన్‌ యూనిట్లుప్రస్తుత వార్షిక సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. తాజా నూతన తయారీ కేంద్రం నుంచి నెలకు రూ.6 లక్షల మొబైళ్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాన్నారు. భవిష్యత్‌లో దీన్ని ఎగుమతి కేంద్రంగా  కూడా ఉపయోగించనున్నట్లు జియోని  వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా ఇనీషియేటివ్ లో భాగంగా తమ సొంత తయారీ యూనిట్లపై దృష్టిపెట్టినట్టు జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ వోరా తెలిపారు.

కాగా 2013 లో భారత మార్కెట్లో ప్రవేశించిన జియోని 2015 చివరి నాటికి రూ 3,250 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్టు  మార్కెట్ వర్గాల విశ్లేషణ. మరోవైపు ఈ సంవత్సరం చివరినాటికి మూడు రెట్లు  టర్నోవర్ పై కంపెనీ దృష్టిపెట్టింది. జియోనీకి  తమిళనాడు, నోయిడాలో రెండు  యూనిట్లు ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు