రోడ్డుపైకి గూగుల్ ఉద్యోగులు

31 Jan, 2017 17:04 IST|Sakshi
రోడ్డుపైకి వచ్చిన గూగుల్ ఉద్యోగులు
వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను నిరసిస్తూ 2000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. ఏడు ముస్లిం దేశాలను అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్కు వ్యతిరేకంగా వారు ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ ఆదేశాలకు చెంపచెట్టులా 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం సమీకరించిన గూగుల్, వెంటనే ఇలా ర్యాలీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
గూగుల్ ఉద్యోగులందరూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు చేస్తున్న ఈ ర్యాలీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్లు మద్దతు పలుకుతున్నాయి. మద్దతిచ్చే వాటిలో మౌంటేన్ వ్యూ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ క్యాంపస్లు ఉన్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ మౌంటేన్ వ్యూ క్యాంపస్లో నిర్వహించబోయే కంపెనీ ఉద్యోగుల ర్యాలీలో ప్రసంగించారు. పిచాయ్ కూడా వలసవాదుడు కావడం విశేషం.
 
ట్రంప్ ఆర్డర్కు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని తెలిపారు. ట్రంప్కు వ్యతిరేకంగా శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జరిగిన నిరసనలో పాల్గొన్న గూగుల్ సెర్జీ బిన్, తను కూడా ఒక వలసవాది, శరణార్థి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు ఆరేళ్లు ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ నుంచి అమెరికాకు తన కుటుంబసభ్యులు తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రాథమిక విలువలు, విధానాల రూపకల్పనలు వంటి వాటిపై డిబేట్ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 మంది గూగుల్ ఉద్యోగులపై ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు ప్రభావం చూపనున్నాయి. వారికి సహాయం కోసం కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.  

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

 

మరిన్ని వార్తలు