మమతపై మండిపడ్డ జీజేఎం

3 Aug, 2013 14:54 IST|Sakshi

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) శనివారం నిప్పులు చెరిగింది. డార్జీలింగ్ ప్రాంతంలో తమ పార్టీని నామ రూపాలు లేకుండా చేసేందుకు మమత బెనర్జీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని జీజేఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్ శనివారం డార్జీలింగ్లో ఆరోపించారు. అందులో భాగంగానే తమ పార్టీ అనుబంధ సంస్థ ట్రేడ్ యూనియన్ నాయకుడు సరోజ్ తమంగ్ను హత్య చేశారని ఆయన పేర్కొన్నారు.

 

కాగా డార్జీలింగ్లో బంద్ శనివారం కూడా కొనసాగుతోంది. డార్జీలింగ్ హిల్స్ ప్రాంతంలోని పట్టణంలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట సాధనలో భాగంగా జీజేఎంకు చెందిన నేతలు న్యూఢిల్లీ తరలి వెళ్లారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం వలే తమకు కూడా గుర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలని జీజేఎం నేతలు పలువురు ఎంపీలను కలిసి వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు