జీఎస్టీ రోడ్మ్యాప్పై నేడే ప్రకటన

4 Aug, 2016 08:45 IST|Sakshi
జీఎస్టీ రోడ్మ్యాప్పై నేడే ప్రకటన

న్యూఢిల్లీ : సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం ఎట్టకేలకు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుపై, ప్రభుత్వం నేడు రోడ్ మ్యాప్ ప్రకటించనుంది. ఏకీకృత పన్ను పాలన అమలుకు సంబంధించి ప్రభుత్వం గురువారం రోడ్ మ్యాప్ వివరాలు వెల్లడించనుందని రెవెన్యూ సెక్రటరీ హష్ముఖ్ అధియా తెలిపారు. ఇప్పటినుంచే అసలైన పని ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఎంత వీలైతే అంత త్వరగా ఈ పన్నును అమలుచేస్తామన్నారు.

కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు, రాష్ట్రాలు వసూలు చేసే చిల్లర అమ్మక పన్నుల స్థానంలో ఏకీకృతమైన జీఎస్టీని అమలుచేయడానికి వీలు కల్పించేందుకు రాజ్యాంగ(122వ సవరణ) బిల్లు-2014ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఏడు గంటల పాటు చర్చ అనంతరం ఓటింగ్లో ఈ బిల్లుకు అనుకూలంగా 203 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.  స్వాతంత్ర్యానంతరం ఇదే అతిపెద్ద పన్ను సంస్కరణ. దేశమంతటిన్నీ ఏకైక మార్కెట్ వ్యవస్థగా రూపొందించడానికి ప్రభుత్వం ఈ కీలక బిల్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజ్యసభలో ఆమోదింపజేసింది.

>
మరిన్ని వార్తలు