భారీ సంఖ్యలో టీవీ, ఎఫ్ఎం చానెల్స్ పై వేటు

12 Aug, 2016 18:50 IST|Sakshi
భారీ సంఖ్యలో టీవీ, ఎఫ్ఎం చానెల్స్ పై వేటు

న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వి శాఖ సంచలన నిర్ణయ తీసుకుంది.  భారీ సంఖ్యలో  టీవీ ఛానెల్స్, ఎఫ్ ఎం లపై వేటు వేసింది. ఇటీవల సంవత్సరాలలో నిబంధనలు  ఉల్లంఘించిన  73టీవీ ఛానెళ్ళు, 24 ఎఫ్ ఎం చానెల్స్ ,  తొమ్మిది వార్తాపత్రికలు  లైసెన్సులను   ఐ అండ్ బి శాఖ రద్దు చేసింది.  కాలపరిమితి మించిన కొన్ని టీవీ చానల్స్,  నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ప్రైవేట్ ప్రసారసాధనాలు సహా,  24  ఎఫ్ఎం,  ఛానల్ లైసెన్సుల రద్దు చేసింది.  మంత్రిత్వ శాఖ అనుమతి ఒప్పందం (జీవోపీఏ) ప్రకారం ప్రసార  మార్గదర్శక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈనిర్ణయం తీసుకున్నామని   కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ రాజ్యసభలో చెప్పారు. అలాగే 1867 సం.రం నాటి  పీఆర్బీ చట్టాన్ని  ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్ గా ఇప్పటికే మార్చినట్టు చెప్పారు.

మరోవైపు  ప్రింట్ మీడియా ప్రమాణములను కట్టడిచేసే పనిలోమంత్రిత్వ శాఖ  పూర్తిగా దృష్టి  పెట్టింది.  ప్రభుత్వ విధానాల సరళీకరణ తరువాత ఈ రంగంలో నెలకొన్న అసాధారణ అభివృద్ధి కారణంగా వీటిని అప్ డేట్ చేయాలని, ప్రింట్ సెక్టార్లో న్యాయ విధానం పునరుద్దరించాల్సిన  అవసరం వచ్చిందని మంత్రి తెలిపారు.

కాగా దేశంలో 42 ప్రైవేట్ ఛానెళ్లు, 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి మంజూరు చేసింది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 892   రిజిస్టర్డ్ ప్రయివేట్ శాటిలైట్ టీవీ ఛానల్స్  ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు