ఆన్ లైన్ లో లీక్.. ఆ సిన్మా కొంపముంచింది!

17 Jul, 2016 19:09 IST|Sakshi
ఆన్ లైన్ లో లీక్.. ఆ సిన్మా కొంపముంచింది!

అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'మస్తీ', 'గ్రాండ్ మస్తీ' సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. 'గ్రాండ్ మస్తీ' సినిమా అయితే ఏకంగా వందకోట్లు వసూలు చేసి.. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో వెల్లువెత్తడానికి గేట్లు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో'మస్తీ' సిరీస్ లో వస్తున్న 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమా కూడా బాగా కాసుల వర్షం కురిపిస్తుందని చిత్రయూనిట్ భావించింది. అయితే; 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తన కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నాడు. 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'ని చిత్తుచేస్తూ 'సుల్తాన్' రెండోవారంలోనూ భారీగా వసూళ్లు రాబడుతున్నాడు. రెండో వీకెండ్ మొదటి రోజైన శుక్రవారం ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 7.43 కోట్లు వసూలు చేసింది. దీంతో జూలై 6న విడుదలైన ఈ సినిమా మొత్తంగా దేశంలో రూ. 236.59 కోట్లు వసూలు చేసి.. కలెక్షన్ల పరంగా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు