హెచ్‌డీఎఫ్‌సీ బాదుడు షురూ!

4 Feb, 2017 12:52 IST|Sakshi
హెచ్‌డీఎఫ్‌సీ బాదుడు షురూ!

ముంబై:  నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచే క్రమంలో దేశంలో రెండవ పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  కీలక  నిర్ణయం తీసుకుంది.  వినియోగదారుల సేవిగ్‌ ఖాతాల  నగదు లావాదేవీలపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ చార్జీలను భారీగా పెంచేందుకు నిర్ణయించింది.  మార్చి 1 నుంచి ఈ పెంచిన చార్జీలు  అమల్లోకి వస్తాయని  బ్యాంకు అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు.
 
బ్యాంకు అధికారిక  వెబ్ సైట్  వివరాల ప్రకారం...థర్డ్‌పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను​  రూ.25  వేలకు కుదించింది. ఇప్పటివరకూ ఈ పరిమితి రోజుకు రూ.50 వేలు. అలాగే  ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ను​ అయిదు నుంచి నాలుగుకి తగ్గించింది. నాన్-ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ పై కూడా  చార్జీల మోత మోగనుంది. లిమిట్ దాటిన లావాదేవీలపై చార్జీలను  50 శాతం 150 శాతం దాకా బాదేయనుంది.  

హోం బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్  పై  కూడా పరిమితులను విధించింది. విత్ డ్రాయల్స్  అయినా  డిపాజిట్స్  అయినా ఇకపైన  రూ.2 లక్షల వరకే పరిమితిం.  ఆ తరువాత కనీసం చార్జీ రూ.150 ఫీజుగాను,  లేదా  వెయ్యికి రూ.5 లు గానీ చెల్లించాల్సింది ఉంటుంది.  థర్డ్ పార్టీ ( హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కాక ఇతర) లావాదేవీలపై కూడా ఇదే చార్జీలను వసూలు చేయనుంది.
 

మరిన్ని వార్తలు