అక్రమాల కేసులో ఎన్నారై వైద్యుడికి రెండేళ్ల జైలు

1 Nov, 2013 11:25 IST|Sakshi

తాను వైద్యం చేయకపోయినా చేసినట్లు చూపించి, నకిలీ వైద్యబీమా క్లెయిమ్ సమర్పించినందుకు ఓ భారతీయ వైద్యుడికి అమెరికాలో రెండు సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఓక్లహామాలో వైద్యవృత్తిలో ఉన్న అమర్ నాథ్ భండారీ (53)కి 30 నెలల జైలుశిక్ష విధించడంతో పాటు 12.37 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు ఆయనను పరిశీలిస్తుండాలని ఆదేశించారు.

దీంతోపాటు.. మెడికేర్ బీమా సంస్థకు భండారీ నష్టపరిహారం చెల్లించాలని, అందుకోసం కొంత ఆస్తిని కూడా వదులుకోవాలని తెలిపారు. 2008 సంవత్సరంలో జరిగిన అక్రమాలపై ఈ సంవత్సరం మే నెలలో భండారీపై కేసు నమోదైంది. మానసిక వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న భండారీకి ఓక్లహామాలో ప్రాక్టీసు చేసుకోడానికి లైసెన్సు ఉంది. గతంలో కొన్ని నియంత్రిత పదార్థాలను అక్రమంగా సరఫరా చేశారన్న ఆరోపణలు కూడా ఈయనపై వచ్చాయి. ఇలా ఈయన ఇచ్చిన మందుల వల్ల ఐదుగురు రోగులు మరణించారు కూడా!!

మరిన్ని వార్తలు