39 ఏళ్ల జైలు.. 80 లక్షల జరిమానా

22 Jan, 2016 07:01 IST|Sakshi
39 ఏళ్ల జైలు.. 80 లక్షల జరిమానా

సెక్యూరిటీ గార్డును చంపిన కేరళ బిజినెస్ మ్యాన్‌కు శిక్ష
త్రిస్సూర్: తన ఇంటి సెక్యూరిటీ గార్డును కిరాతంగా చంపిన కేసుతో పాటు ఇతర కేసుల్లో కేరళ బీడీ వ్యాపార దిగ్గజం మహ్మద్ నిషామ్‌కు 39 ఏళ్ల శిక్ష పడింది. రూ. 80.30 లక్షల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గురువామిక్కడి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కేపీ సుధీర్ ఈ శిక్ష విధించారు. హత్యకేసులో జీవితఖైదుతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇతర కేసుల్లో 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. . రూ. 5 వేల కోట్ల సంపద కలిగిన నిషామ్‌ను.. తీర్పు తర్వాత కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, నిషామ్‌కు మరణ దండన విధించాలని, చనిపోయిన గార్డు చంద్రబోస్ (51) కుటుంబానికి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలన్న ప్రాసిక్యూషన్ వాదనను జడ్జి తోసిపుచ్చారు.

జరిమానా నుంచి రూ. 50 లక్షలు చంద్రబోస్ భార్య జమంతికి ఇవ్వాలని తీర్పిచ్చారు. సాక్షిగా ఉండి ప్రతికూలంగా సాక్ష్యమిచ్చిన నిషామ్ భార్య అమల్‌పై విచారణ చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూషన్‌కు కోర్టు ఆదేశించింది. తాగిన మైకంలో.. గతేడాది జనవరి 29న తెల్లవారుజామున తాగిన మైకంలో ఇంటికి వచ్చిన నిషామ్.. తన ఇంటి గేట్‌ను తొందరగా తీయలేదన్న కోపంతో గార్డుపైకి పైశాచికంగా తన లగ్జరీ కారుపోనిచ్చి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ గార్డును ఆస్పత్రిలో చేర్చగా ఫిబ్రవరిలో చనిపోయాడు.  2013లో తన తొమ్మిదేళ్ల కుమారుడుతో ఫెరారీ కారు డ్రైవ్ చేయించి వీడియోను యూట్యూబ్‌లో పెట్టడంతో మీడియాలో నిషామ్ కనిపించాడు. తర్వా తర్వాత ఒక మహిళా ఎస్సైనీ గాయపర్చాడు.
 
కుటుంబ సభ్యుల అసంతృప్తి..  
నిషామ్‌కు పడిన శిక్షపై చంద్రబోస్ భార్య, తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషామ్ ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా తేడా ఉండదని, ఆవే సుఖాలు అనుభవిస్తాడని భార్య చెప్పింది.  నిషామ్‌కు మరణ శిక్ష పడుతుందని భావించామని తల్లి  తెలిపింది.  జమంతికి కేరళ ప్రభుత్వం టైపిస్టుగా ఉద్యోగం కల్పించింది.

మరిన్ని వార్తలు