ఆదాయంలో 75 శాతం దానం: ఎల్‌అండ్‌టీ చీఫ్

26 Aug, 2016 11:00 IST|Sakshi
ఆదాయంలో 75 శాతం దానం: ఎల్‌అండ్‌టీ చీఫ్

ముంబై : ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో చీఫ్గా వ్యవహరిస్తున్న ఏఎం నాయక్ తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. జీవితకాలపు ఆదాయాల్లో 75 శాతం స్వచ్చంద సంస్థలకే కేటాయించనున్నట్టు వెల్లడించారు. 1600 కోట్ల డాలర్ల సంపదతో ఇంజనీరింగ్ దిగ్గజంగా ఉన్న ఎల్ అండ్ టీ క్రియాశీల నాయకత్వం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. స్వచ్చంద సేవ అనేది తన వ్యక్తిగత కోరికని, తన మూడు తరాల్లో తాతయ్య, తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారు పేదలుగానే జీవనం గడిపారని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన 75 శాతం ఆదాయాలను స్వచ్చంద సేవలకే వినియోగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.


నాయక్ ఇప్పటికే రెండు స్వచ్చంద సంస్థలను ఏర్పాటుచేశారు. ఒకటి నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ట్రైనింగ్, మరొకటి 2007లో తన మనువరాలు క్యాన్సర్‌తో చనిపోవడంతో నిరాళి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ను స్థాపించారు. అయితే ఇప్పటివరకు ఈ సంస్థలకు కేటాయించిన నిధుల వివరాలను నాయక్ తెలుపలేదు. నాయక్ మొదటి డొనేషన్ 1995లో గుజరాత్లోని తన స్వగ్రామంలో ఓ ఆస్పత్రికి కు రూ.125 కోట్లను ఇచ్చారు.  నాయక్ ట్రస్టులు ఏడు ప్రాజెక్టులను రన్ చేస్తున్నాయి. వాటిలో రెండు 2017లో ప్రారంభం కానున్నాయి. దానిలో ఒకటి తన భార్య పేరుమీద ఆమె పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వేదిక్ స్కూల్గా ఆవిష్కరించబోతున్నారు.


నాయక్ ప్రతియేటా తన వేతనంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.  1965లో ఎల్ అండ్ టీలో జూనియర్ ఇంజనీర్గా నాయక్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం 1999లో సీఈవోగా, 2003లో చైర్మన్గా ఎంపికయ్యారు. 2012లో అతని చైర్మన్ పదవిని ఎల్ అండ్ టీ పొడిగించింది. 2017లో ఆయన రిటైర్ కాబోతున్నారు.  నాయక్కు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు.

మరిన్ని వార్తలు