ఇంతటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు

29 Aug, 2016 17:55 IST|Sakshi
ఇంతటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు

స్టాక్హామ్: నార్వేలో పిడుగుపాటుకు 323 ధ్రువప్రాంతపు జింకలు మరణించాయి. నార్వే మధ్యప్రాంతంలోని హార్డన్గెర్విడ్డా పర్వత శ్రేణుల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇది అసాధారణ పెద్ద ప్రకృతి విపత్తు అని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు అభివర్ణించారు. నార్వే పర్యావరణ సంస్థ ప్రమాద సంబంధిత ఫొటోలను విడుదల చేసింది. పర్వత ప్రాంతంలో జింకల కళేబరాలు కుప్పలు కుప్పలుగా పడిఉన్నాయి.

ప్రతికూల వాతావరణంలో ధ్రువజింకలు గుంపుగా ఒకేచోట ఉంటాయని, భారీ ప్రాణనష్టం జరగడానికి ఇదే కారణమని పర్యావరణ సంస్థ అధికారులు చెప్పారు. ఇది అసాధారణ దుర్ఘటన అని, పిడుగుపాటు వల్ల ఇంత భారీ సంఖ్యలో జింకలు లేదా ఇతర వన్య ప్రాణులు మరణించినట్టు గతంలో ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి ధ్రువప్రాంతపు జింకలు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు