లిక్కర్ షేర్లకు కిక్కిచ్చిన హైకోర్టు వ్యాఖ్యలు

30 Sep, 2016 13:20 IST|Sakshi
లిక్కర్ షేర్లకు కిక్కిచ్చిన హైకోర్టు వ్యాఖ్యలు

పట్నా:  బీహార్  ప్రభుత్వం విధించిన మద్యనిషేధం చట్టవిరుద్ధమని  పట్నా హైకోర్టు తేల్చిచెప్పడంతో మార్కెట్లలో లిక్కర్ షేర్లకు  భలే కిక్ వచ్చింది.   ఇన్వెస్టర్ల  కొనుగోళ్ల ఒత్తిడితో ఒక్కసారిగా భారీగా ర్యాలీ అయ్యాయి.  నిష్టీ 0.9 నష్టాలతో ఫ్లాట్ గా  ట్రేడవుతుండగా  హైకోర్టు  వ్యాఖ్యల నేపథ్యంలో మార్కెట్లో లిక్కర్  కంపెనీలకు మంచి డిమాండ్ పెరిగింది. మదుపర్లు భారీ కొనుగోళ్లతో దాదాపు 3 నుంచి 12 శాతానికి పైగా లాభపడ్డాయి. గ్లోబల్ స్పిరిట్స్ 10 శాతం, రాడికో ఖైతాన్‌ 8.5 శాతం , తిలక్‌నగర్ ఇండస్ట్రీస్‌ 9 శాతం లాభపడగా,  యునైటెడ్‌ స్పిరిట్స్ 6 శాతం,  యునైటెడ్‌ బ్రూవరీస్ 3 శాతం, పిన్‌కాన్‌ స్పిరిట్స్ 5 శాతానికి పైగా లాభాలను ఆర్జిస్తున్నాయి.

కాగా బీహార్ లో నితిష్ కుమార్ ప్రభుత్వం విధించిన   మద్య నిషేధ విధానాలను  తప్పు బట్టిన పట్నా  హైకోర్టు మద్య నిషేధాన్ని రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని శుక్రవారం  తేల్చి చెప్పింది.  
 

మరిన్ని వార్తలు