'చపాతి' ఘటనపై అద్వానీ అసంతృప్తి

23 Jul, 2014 15:09 IST|Sakshi
'చపాతి' ఘటనపై అద్వానీ అసంతృప్తి

న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన 'చపాతి' ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్య చర్య కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో బలవంతంగా శివసేన ఎంపీలు చపాతి తినింపించిన ఘటనపై ఆయనీ విధంగా స్పందించారు.

తమకు మహారాష్ట్ర వంటకాలు పెట్టలేదనే ఆగ్రహంతో శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
 

మరిన్ని వార్తలు