'ఆ అమ్మాయి వస్తే.. స్వాగతం పలుకుతాం'

21 Oct, 2015 19:18 IST|Sakshi
'ఆ అమ్మాయి వస్తే.. స్వాగతం పలుకుతాం'

ముంబై: పాకిస్థాన్తో క్రికెట్ సిరీస్ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆ దేశ కళాకారులను, సినీ నటులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చిరించిన శివసేన.. పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ విషయంలో భిన్నంగా స్పందించింది. మలాలా భారత్కు ఎప్పుడు వచ్చినా స్వాగతం పలుకుతామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పారు.

'భారత్లోని శాంతిదూతలకు ఓ మాట చెబుతున్నా. పాకిస్థాన్లో ఉగ్రవాదంపై మలాలా పోరాటాన్ని శివసేన, సామ్నా అభినందిస్తోంది. మలాలా భారత్కు వస్తే శివసేన స్వాగతం పలుకుతుంది' అని సంజయ్ రౌత్ అన్నారు. కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో హింసకు ప్రేరిపిస్తున్నారని, చిన్నమ్మాయి అయిన మలాలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ నోబెల్ బహుమతిని గెల్చుకుందని చెప్పారు. మలాలాకు స్వాగతం పలికడం వల్ల.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని భారత్లోని పాకిస్థాన్ ప్రేమికులకు సందేశాన్ని పంపినట్టు అవుతుందని అన్నారు. భారత్ను సందర్శించాలని ఉందని, బాలికల్లో స్ఫూర్తి నింపేందుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాలని ఉందని మలాలా ఇటీవల చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా