ఓఎన్‌జీసీ కోసం మేఘా గేదరింగ్ స్టేషన్

19 Nov, 2013 09:44 IST|Sakshi
ఓఎన్‌జీసీ కోసం మేఘా గేదరింగ్ స్టేషన్

 హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) నిర్మించిన గ్రూప్ గేదరింగ్ స్టేషన్(జీజీఎస్)ను చమురు శాఖ మంత్రి ఎం. వీరప్పమెయిలీ జాతికి అంకితం చేశారు. అస్సాంలో నాలుగు దశాబ్దాల క్రితం  నిర్మించిన ఓఎన్‌జీసీ ఇంధన వ్యవస్థను పునర్నిర్మించే ప్రాజెక్ట్‌ను తాము పొందామని, ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అస్సాంలోని లక్వా ప్రాంతంలో ఈ జీజీఎస్‌ను నిర్మించామని ఎంఈఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ 2030 కల్లా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు.
 
  దీంట్లో భాగంగా జీజీఎస్ నిర్మాణం ఒక ముందడుగని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ సీఎండీ సుధీర్ వాసుదేవ, ఎంఈఐఎల్ ఎండీ, పీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అసోంలోని 500 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్‌లైన్లతో పాటు పంపింగ్, గ్రూప్ గేదరింగ్ తదితర కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు