జార్ఖండ్ కు తొలి గిరిజనేతర సీఎం?

24 Dec, 2014 08:30 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్‌పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్(రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి.

సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది.

మరిన్ని వార్తలు