నేనేమీ ఆయన పరువు తీయలేదు

12 Jul, 2016 14:46 IST|Sakshi
నేనేమీ ఆయన పరువు తీయలేదు
  • ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను
     
  • న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది.
    ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?')

    డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు.
     

మరిన్ని వార్తలు