ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్

7 Sep, 2013 03:30 IST|Sakshi
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్

న్యూఢిల్లీ: భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తోసిపుచ్చింది. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ, సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల (పీఐఎల్) పిటిషన్ నిరాధారమని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్‌పై 51 పేజీల అఫిడవిట్‌ను ఆర్‌ఐఎల్ దాఖలు చేసింది. కేంద్రంతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌కు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అఫిడవిట్ తెలిపింది.
 

మరిన్ని వార్తలు