ఎన్‌టీపీసీ ఫలితాలు

28 Oct, 2016 16:36 IST|Sakshi


ముంబై: విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ లిమిటెడ్   నిరాశాజనక   ఫలితాలను  నమోదు చేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో స్వతంత్ర నికరలాభాలు17.87 శాతం తగ్గి రూ.2,496 కోట్లుగా  నమోదు చేసింది.  గత ఏడాది ఇది రూ.3,039 కోట్లుగా ఉంది.   జూలై-సెప్టెంబర్‌ క్యూ2  లో మొత్తం ఆదాయం రూ. 19,398 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 5,396 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 27.8 శాతంగా నమోదయ్యాయి. అయితే ఇతర ఆదాయం రూ. 278 కోట్ల నుంచి రూ. 191 కోట్లకు క్షీణించింది.
ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ప్రధాన విద్యుదుత్పత్తి  సంస్థ ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ 17,994 కోట్లతో  పోలిస్తే రూ 19,492 కోట్లకు పెరిగిందని సంస్థ అధికారి ఒకరు  చెప్పారు. ఫలితాల నేపథ్యంలో  ఎన్‌టీపీసీ షేరు 1.2 శాతం  బలపడినా స్వల్పలాభంతో రూ. 152దగ్గర ముగిసింది.
 

మరిన్ని వార్తలు