'ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు' | Sakshi
Sakshi News home page

'ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు'

Published Fri, Oct 28 2016 4:39 PM

'ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు' - Sakshi

న్యూఢిల్లీ: 1984లలో అఫ్గానిస్తాన్‌ వలసలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆకుపచ్చ కళ్ల ‘అఫ్గాన్ బాలిక’ షర్బత్ గులాను పాకిస్థాన్ అరెస్ట్ చేయడాన్ని ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెక్‌కర్రీ ఖండించారు. ఆమెను అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుందని పేర్కొన్నారు. షర్బత్ గులాకు అండగా నిలబడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.

నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉందన్న ఆరోపణలపై పాకిస్తాన్‌లో గులాను బుధవారం అరెస్ట్ చేశారు. దీనిపై మెక్‌కర్రీ స్పందిస్తూ...'పాకిస్తాన్ అధికారులు తీసుకున్న చర్య తీవ్ర ఆక్షేపణీయం. షర్బత్ గులా జీవితమంతా కష్టాలమయం. ఆమెను అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంద'ని మెక్‌కర్రీ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. గులాకు సహాయ పడాలని పాకిస్తాన్ ప్రముఖ మానవ హక్కుల అటార్నితో మాట్లాడినట్టు వెల్లడించారు. ఆమెకు అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని కోరారు.

Advertisement
Advertisement