క్యాబ్ వినియోగదారులకు శుభవార్త

11 Aug, 2016 19:18 IST|Sakshi
క్యాబ్ వినియోగదారులకు శుభవార్త

న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ల అధిక చార్జీల వసూళ్లకు ఢిల్లీ కోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వం నిర్ణంయించిన ధరలను మాత్రమే క్యాబ్ లు వసూలు చేయాలని తేల్చిచెప్పింది. యాప్ బేస్డ్ అప్లికేషన్స్ లో లోపాల కారణంగా వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేస్తుండటంపై కోర్టు విచారించింది.

ప్రముఖ మొబైల్ సర్వీసులైన ఓలా, ఉబెర్ లు అధికచార్జీలు వసూలు చేసిన క్యాబ్ కంపెనీల లిస్టులో ఉన్నాయి. యాప్ లో వచ్చిన దోషాల కారణంగానే చార్జీలు అధికంగా పడుతున్నాయని ఉబెర్ కోర్టుకు నివేదించగా, యాప్ లోని తప్పులు సరిదిద్దుకున్నట్లు ఓలా పేర్కొంది. దోషాలను సరిచేయడానికి పదిరోజుల సమయం కావాలని ఉబెర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నెల 22లోగా ఎట్టిపరిస్థితుల్లో యాప్ లలోని దోషాలను సరిదిద్దుకోవాలని కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్ ఆదేశించారు. 2013లో క్యాబ్ లు వసూలు చేయాల్సిన చార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

క్యాబ్ చార్జీ వివరాలు (ఒక కిలోమీటరుకు):

ఎకానమీ రేడియో ట్యాక్సీ: రూ.12.50/-

నాన్-ఏసీ బ్లాక్ ట్యాక్సీ: రూ.14/-

నాన్-ఏసీ ఎల్లో టాప్ ట్యాక్సీ: రూ.14/-

ఏసీ ఎల్లో టాప్ ట్యాక్సీ: రూ.16/-

ఏసీ బ్లాక్ ట్యాక్సీ: రూ.16/-

ఎల్లో రేడియో ట్యాక్సీ(ఎల్ సీడీ డిస్ప్లే కలిగినవి): రూ.23/-

నైట్ చార్జ్: రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కిలోమీటరుకు అదనంగా 25 శాతం చార్జ్ చేస్తారు.

మరిన్ని వార్తలు