మరోసారి వార్తల్లో రాందేవ్‌ బాబా

1 May, 2017 11:41 IST|Sakshi
మరోసారి వార్తల్లో రాందేవ్‌ బాబా

లక్నో: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌  మరోసారి విదేశీ బహుళజాతి సంస్థలపై  తన దాడిని ఎక్కు పెట్టారు.  రాబోయే అయిదేళ్లలో దేశంనుంచి వీటిని తరిమి కొడతామంటూ ఆయన నిలిచారు. తమ కన్జ్యూమర్‌  ఉత్పత్తుల ద్వారా  ఎంఎన్‌సీలను దేశంనుంచి తరిమివేస్తామని  రాందేవ్‌ హెచ్చరించారు.  ఆ వైపుగా తమ పతంజలి ఉత్పత్తులు  పయనిస్తున్నాయని  బహుళజాతి సంస్థ దోపిడీనుంచి త్వరలో దేశానికి విముక్తి కల్పిస్తామని రాందేవ్‌ ప్రకటించారు. 

యోగి భరత్‌ భూషణ్‌ జయంతి  సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  విదేశీ బహుళజాతి సంస్థలు దేశం అభివృద్ధి కోసం పనిచేయడంలేదని, వారి ఏకైక లక్ష్యమే భారత్‌ను  దోచుకోవడమేనని  బాబా మండిపడ్డారు.  దోపిడియే ప్రధాన ఉద్దేశ్యంతో దేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీతో  ఎంఎన్‌సీలను ఆయన పోల్చారు.   తాము తదుపరి ఐదేళ్ళలో భారతీయ మార్కెట్ నుంచి తరిమివేస్తామన్నారు. ఎంఎన్‌సీల నుంచి భారతదేశాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

అలాగే దేశంలోని రైతులకు  వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుందని చెప్పారు. పతంజలి ఆధ్వర్యంలో రైతులకు తాజా ఉత్పాదకాలపైనా,  వివిధ నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడంపై అవగాహన కల్పిస్తామన్నారు.  దీంతోపాటుగా రైతులకు గిట్టుబాటు  ధరలను అందిస్తామని తెలిపారు.  ఈ సందర్బంగా  యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై  రాందేవ్‌ ప్రశంసలు  కురిపించారు. ప్రజలకు సత్సంబంధాలను  ఏర్పరచుకుంటోందన్నారు.


 

మరిన్ని వార్తలు