భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

1 Apr, 2017 08:02 IST|Sakshi
భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. కొద్ది కాలంగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు భారీగా తగ్గాయి. ఒక లీటరు పెట్రోల్‌ ధర రూ.3.77, ఒక లీటరు డీజిల్‌ ధర రూ.2.91 తగ్గింది. ఈ మేరకు ఆయిల్‌ కంపెనీల సమాఖ్య శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

తగ్గించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. పెట్రోల్‌ ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్‌ కంపెనీలకు కట్టబెట్టిననాటిననాటినుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75.91గాను, డీజిల్‌ రూ.64.34గానూ ఉంది. తగ్గిన ధరలతో పెట్రోల్‌ రూ.72.14కు, డీజిల్‌ రూ.61.43కు దిగిరానుంది. (గమనిక:ఆయిల్‌ కంపెనీని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి)

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్ఠానికి చేరుకోవడంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారి 50 డాలర్ల దిగువ ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందనే వార్తలు ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు