ఇరోమ్ షర్మిలకు బెదిరింపులు

5 Aug, 2016 18:48 IST|Sakshi
ఇరోమ్ షర్మిలకు బెదిరింపులు

16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను ఆపి వివాహం చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న మణిపూరి ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళకు బెదిరింపులు వచ్చాయి. ఓ కారణం కోసం పోరాడి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారందరూ ఆ తర్వాత హత్యకు గురైనట్లు సెసెస్సనిస్ట్ అలయన్స్ ఫర్ సోషల్ యూనిటీ(ఏఎస్ యూకే) షర్మిళకు గుర్తుచేసింది. అంతగా ప్రచారం లేని ఈ సంస్థ ఢిల్లీ కంట్రోల్ నుంచి మణిపూర్ ను స్వతంత్ర రాజ్యంగా చేయాలనే ఆలోచనకు దన్నుగా నిలుస్తూ వస్తోంది.

ఏఎస్ యూకే కు  చెందిన రెండు మిలిటెంట్ గ్రూపులు కాంగ్లయ్ యవోల్ కన్నా లుప్, కాంగ్లాయ్ పక్ కమ్యూనిస్ట్ పార్టీలు షర్మిళలను దీక్ష కొనసాగించాలని కోరాయి. ఈ నెల 9న దీక్ష విరమిస్తానని షర్మిళ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షర్మిళ స్థానికుడినే వివాహం చేసుకోవాలని ఏఎస్ యూకే చైర్మన్, వైస్ చైర్మన్ లు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా షర్మిళ బ్రిటిష్ యాక్టివిస్ట్ డెస్మాండ్ కౌటిన్హో తో రిలేషన్ షిప్ లో ఉన్నారు.

మరిన్ని వార్తలు