Kishan Reddy Hunger Strike: దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి..

14 Sep, 2023 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్‌ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. 

మరోవైపు.. కేసీఆర్‌ సర్కార్‌పై ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం కాదు. 17పేపర్లు లీక్‌ చేసి.. తెలంగాణ విద్యార్థులకు విషాదం మిగిల్చారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు. కేసీఆర్‌ పాలన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు

మరిన్ని వార్తలు