వాన్నా క్రై షాకింగ్‌: బ్యాంకింగ్‌ వ్యవస్థపై దాడి

16 May, 2017 19:28 IST|Sakshi
వాన్నా క్రై షాకింగ్‌: బ్యాంకింగ్‌ వ్యవస్థపై దాడి

న్యూఢిల్లీ: 'వానా క్రై రాన్సమ్‌వేర్‌' ప్రకంకపనలు త్వరలోనే  భారత బ్యాంకింగ్‌  వ్యవస్థను తాకనున్నాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాన్సమ్‌ వేర్‌    సైబర్‌ ఎటాక్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ  దీని బారిన పడుతున్న సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.  దీంతో వివిధ సంస్థలు, బ్యాంకులకు  సైబర్‌ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
 వానా క్రై ప్రభావం చాలా రాష్ట్రాలపై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది అనేది చెక్‌ చేయడంలేదని  సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు శుభ మంగళ ఏఎన్‌ఐ కి చెప్పారు.  దాడుల తరువాతి ప్రకంకపనలు బ్యాంకింగ్ రంగంలో ప్రారంభంకానున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరో కొన్నిగంటల్లోనే బ్యాంకులు ప్రభావితమవుతాయని  చెబుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సమాచారం అందించామన్నారు. ఎందుకంటే వానాక్రై బారిన పడుతున్న విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంతోనే  ఏటీఏం నిర్వహరణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్థలు, వ్యాపారాలు మరియు ఇతర రంగాల వారికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, వ్యవస్థలను నవీకరించడానికి హెచ్చరించినట్టు తెలిపారు.

మరోవైపు  ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఏటీఏం ట్రాన్సాక్షన్స్‌ చేయొద్దంటూ  ఇప్పటికే  సోషల్‌మీడియాలో  హెచ్చరికలు,  వార్తలు  విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.  రానున్న రెండు మూడు రోజుల్లో ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందన్నఅంచనాలు  భారీగా నెలకొన్నాయి.

కాగా 'వానా క్రై రాన్సమ్‌వేర్‌' ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో వేల సైబర్‌ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా  మన దేశంలో పశ్చిమ   బెంగాల్‌,  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ  లాంటి రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి.  అయితే ద్చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సైబర్‌ దాడిలో నేరగాళ్లు ద్రవ్య ప్రయోజనాలను పొందలేదని   ఐబీ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా