శశికళకు ఎదురుదెబ్బ

8 Feb, 2017 12:32 IST|Sakshi
శశికళకు ఎదురుదెబ్బ
అంకెలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని.. గ్రహాల సానుకూలత కూడా చూసుకుని ఈసారి మంచి ముహూర్తం పెట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేద్దామని అనుకున్న శశికళా నటరాజన్‌కు అనుకోని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికపై ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. పార్టీ నిబంధనావళిలో ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శి అనే పదవే లేదని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని సంబరపడుతున్న నేపథ్యంలో అనుకోకుండా ఈ షాక్ తగిలింది. 
 
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తంబిదురై శశికళ పక్షంలో అంతా తానై చూసుకుంటున్నారు. అయితే.. స్పీకర్ ధనపాల్ మాత్రం పన్నీర్ సెల్వంతో ఉన్నట్లు చెబుతున్నారు. అన్నాడీఎంకేలో అత్యున్నత పదవి ప్రధాన కార్యదర్శే. ఇంతకుముందు జయలలిత కూడా అదే పదవిలో ఉండేవారు. అలాంటి పదవిని వదులుకోవడం కూడా శశికళకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటీసులు రావడంతో.. ఏం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో పడ్డారు.
మరిన్ని వార్తలు