అప్రమత్తంగా ఇన్వెస్టర్లు.. నష్టాల్లో మార్కెట్లు

3 Aug, 2016 09:46 IST|Sakshi
అప్రమత్తంగా ఇన్వెస్టర్లు.. నష్టాల్లో మార్కెట్లు

ముంబై : ఆసియన్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్తో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 135.57 పాయింట్లు నష్టపోతూ 27,846 వద్ద, నిఫ్టీ 33.75 పాయింట్ల నష్టంతో 8,589 దగ్గర కొనసాగుతోంది. ఆసియన్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్తో పాటు రాజ్యసభలో నేడు జీఎస్టీ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జీఎస్టీను 2016 ఆగస్టు 1 నుంచి అమలుచేయవచ్చని భావిస్తున్నారు. 

ఐటీ మేజర్గా ఉన్న హెచ్సీఎల్ టెక్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి లాభాల్లో దూసుకుపోవడంతో ట్రేడింగ్ ప్రారంభంలో షేర్లు 5శాతం దూసుకెళ్లాయి. టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, లుపిన్లు లాభాలు పండిస్తుండగా.. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టీసీఎస్, ఐటీసీ నష్టాలను గడిస్తున్నాయి.  మరోవైపు అమెరికా మార్కెట్లూ నష్టాలోనే నమోదయ్యాయి.

అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 66.73 పైసలుగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.261 పాయింట్లు ఎగిసి, రూ.31,795 గా ట్రేడ్ అవుతోంది.

మరిన్ని వార్తలు