ఫోటో చాన్సివ్వకుంటే ఆత్మాహుతి

14 May, 2017 21:53 IST|Sakshi
ఫోటో చాన్సివ్వకుంటే ఆత్మాహుతి
- సేలం జిల్లా రజనీకాంత్‌ అభిమానుల సంఘం హెచ్చరిక
 
సేలం:  కన్నవారి మీదకంటే హీరోలంటేనే అమితమైన అభిమానం, ప్రేమ ప్రదర్శిస్తారు అభిమానులు. అలాంటి వారికి కొన్ని సమయాల్లో హీరోతో కలిసి పోటో తీసుకునే అవకాశం కూడా దొరకదు. జీవితమంతా అభిమానులుగా కొనసాగిన తమకు ఫొటో తీసుకునే అవకాశం కల్పించకుంటే రజనీకాంత్‌ ఇంటిముందే ఆత్మాహుతికి పాల్పడతామని సేలం రజనీకాంత్‌ అభిమానులు హెచ్చరించారు. సేలం జిల్లా రజనీకాంత్‌ అభిమానుల సంఘం సమావేశం ఆదివారం జరిగింది.

ఈ సందర్భంగా ఆ సంఘ న్యాయసలహాదారు ఏ.ఎస్‌.రజని మాట్లాడుతూ.. రజీనీతో కలిసి ఫొటో తీసుకునేందుకు సేలం జిల్లాకు 250 నుంచి 300 టోకన్లు అందజేశారన్నారు. ఈ టోకన్లను జిల్లా రజనీ అభిమానుల సంఘం కార్యదర్శి పళనివేల్‌ తనకు కావాల్సిన వారికి విక్రయించారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో రజనీ జోక్యం చేసుకుని అసలైన అభిమానులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మాహుతికి పాల్పడతామని ఆయన వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు